Gautam Buddha Quotes Day - 12 ఇతరులను బాధపెట్టేవారు కచ్చితంగా బాధపడతారు దాని నుంచి ఎట్టి పరిస్థితుల్లోనూ తప్పించుకోలేరు సంపదలన్నింటిలోనూ ఆధ్యాత్మిక సంపదే ఉన్నతమైనది . దాన్ని కాంక్షించేవాడు కామం , క్రోధం , లోభం , మోహం , అసూయ , ద్వేషాలను అసురగణాలకు దూరంగా ఉండాలి లేని గొప్ప తనాన్ని ప్రదర్శిస్తే నీలో ఉన్న నిజమైన గొప్పతనం మరుగున పడుతుంది
Gautam Buddha Quotes Day - 11 ఆశ దుఃఖానికి హేతువు అవుతుంది , ఆశ నుండి విముక్తి పొందితే దుఃఖం అంతమవుతుంది . అవసరమైతేనే మాట్లాడు . లేదంటే నిశ్శబ్దంగా ఉండు . సాధ్యమైనంత వరకూ సంభాషణల్లో ఇతరుల ప్రస్తావన వద్దు . ఉత్తమ సంభాషణలు సిద్ధాంతాల చుట్టూ తిరుగుతాయి . నీచమైన సంభాషణలు వ్యక్తుల చుట్టూ తారట్లాడతాయి ” ఆనందంగా ఉండేవారు . తమ దగ్గర ఉన్నదాని గురించి మాత్రమే ఆలోచిస్తే .. ! ఆనందంగా ఉండలేనివారు తమ దగ్గర లేని వాటిని గురించి మాత్రమే ఆలోచిస్తారు .
Gautam Buddha Quotes Day - 22 నీవు బ్రతికుండేది కేవలం ఈ రోజు మాత్రమే అన్నట్లు ... నీ కర్తవ్యాన్ని నిర్వహించు .... ఫలితాన్ని మాత్రం భగవంతునికి వదిలివేయి ... అప్పుడు ప్రపంచంలోని ఏ బాధా మీ దరి చేరదు ... !!! మనిషికి నిజమైన ఆనందం లభించేది కేవలం వారి ఆలోచనలోనే ! మనస్సు ఆనందంగా ఉంటే తనువు ఆరోగ్యంగా ఉంటుంది ” గౌతమబుద్ధుడు
Comments
Post a Comment